మహబూబాబాద్/ ములుగు/ అశ్వారావుపేట/ కూసుమంచి/ ఖిలా వరంగల్(మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఆఫీసర్లు వాహనదారులకు సూచించారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్‌లో భాగంగా బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో ఎస్పీ శబరీశ్తన కుమార్తెతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎస్పీ రోహిత్రాజ్ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు.
కూసుమంచిలో ఏఎస్పీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ బస్సు డ్రైవర్లకు డ్రంక్‌అండ్‌డ్రైవ్ టెస్ట్‌లు చేసి భద్రతపై పలు సూచనలు చేశారు. వరంగల్‌లో కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉర్సు రంగలీలా మైదానం కూడలి వద్ద పోలీసు ఆఫీసర్లు, అధికారులు, విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి సోషల్వెల్ఫేర్, గోవిందరావుపేట మండలం పస్రాలోని పలు పాఠశాలల్లో పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టగా, ఎస్పీ సుధీర్రాంనాథ్కేకన్ పాల్గొని పలు సూచనలు చేశారు.

